నృసింహుడి దర్శనం.. వేయిజన్మల పుణ్యఫలం
17-06-2024 12:48 AM
ఒక్కరోజే రూ.89.65 లక్షల ఆదాయం
యాదాద్రి భువనగిరి, జూన్ 16 (విజయక్రాంతి): యాదాద్రి లక్ష్మీనృసింహుడి ఆలయానికి ఆదివారం సుమారు 50 వేల మంది భక్తులు తరలివచ్చారు. దీంతో దర్శన క్యూలైన్లు, ప్రసాదాల కాంప్లెక్స్‌ల వద్ద రద్దీ కనిపించింది. కొండ కింద సత్యనారాయణ వ్రత మండపంలో పెద్ద సంఖ్యలో జంటలు వ్రత పూజలు ఆచరించారు. ఒక్కరోజే రూ.89,65,064 ఆదాయం సమకూరినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి ఏ భాస్కర్‌రావు తెలిపారు. నృసింహుని జన్మనక్షత్రం స్వాతిని పురస్కరించుకుని మంగళవారం లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సన్నిధిలో గిరిప్రదక్షిణ నిర్వహిస్తున్నట్టు ఈవో వెల్లడించారు.






