రవాణా శాఖ పనితీరు ఇది
విధుల్లో లేని అధికారుల పేర్లు వెబ్‌సైట్‌లో
హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): సీనియర్ ఐఏఎస్ అధికారి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన కేఎస్ శ్రీనివాసరాజు ఈ నెల మొదట్లో తెలంగాణ నుంచి రిలీవ్ అయి ఏపీకి వెళ్లిపోయారు. రవాణా శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న బీ విజయేంద్ర సైతం ఈ నెల 16న మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. అయితే రవాణా శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రం వీరే విధుల్లో ఉన్నట్లుగా చూపిస్తున్నారు. ఇక ఇదే శాఖలో జేటీసీగా పనిచేసిన పాండురంగనాయక్, డిఫ్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ కే పాపారావు స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. వారు కూడా ఇంకా విధుల్లోనే ఉన్నట్లుగా వెబ్‌సైట్‌లో వారి పేర్లు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ విభాగానికి చెందిన వెబ్‌సైట్‌లో ఇక్కడ లేని అధికారులు ఇంకా పనిచేస్తున్నట్లుగా చూపించడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పనితీరుపై విమర్శలు వస్తున్నాయి.






