20 May, 2026 | 2:42 AM

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు

20-05-2026 01:26 AM
  1. నేడు విచారణకు రావాలని గడ్డి అన్నారం 
  2. మార్కెట్ కమిటీ చైర్మన్‌కు పిలుపు

హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో దూకుడు పెంచింది. 2023 ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత, ప్రస్తుత గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ గురైనట్టు సిట్ నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే విచారణకు రావాలని ఆయనకు మంగళవారం నోటీసులు పంపింది. బుధవారం బషీర్‌బాగ్‌లోని సిట్ కార్యాలయంలో విచారణకు రావాలని సూచించింది.