2 July, 2026 | 3:27 AM

అనురాగ్‌లో ముగిసిన డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ శిక్షణ

02-07-2026 01:45 AM

ఘట్ కేసర్, జూలై 1 (విజయక్రాంతి) : అనురాగ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్లోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభా గం ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ కోల్క తా సహకారంతో నిర్వహించిన ఐదు రోజుల అధ్యాపక శిక్షణా కార్యక్రమం ముగిసింది. ఈకార్యక్రమంలో డేటా సైన్స్, స్టాటిస్టిక్స్, పై థాన్ ప్రోగ్రామింగ్, సూపర్వైజ్డి లెర్నింగ్, అ న్సూపర్వైజ్డి లెర్నింగ్, రీన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ వంటి ఆధునిక అంశాలపై నిపుణులు సమగ్ర అవగాహన కల్పించారు.

సిద్ధాంతపరమైన బోధనతో పాటు హ్యాండ్స్-ఆన్ శిక్షణ ద్వారా పాల్గొన్న అధ్యాపకులు, పరిశోధకు లు మరియు విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై విలువైన అనుభవాన్ని పొందా రు. ఈకార్యక్రమానికి డాక్టర్ కిన్సుక్ గిరి, డాక్టర్  జగదీష్ ఎం.ఎస్ కోల్కతా నుండి వనరుల వ్యక్తులుగా పాల్గొని తమ నైపుణ్యాన్ని పంచుకున్నారు. మొత్తం 68 మంది నమోదు చేసుకోగా, వివిధ విద్యాసంస్థల నుండి అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొన్నారు.

ఈశిక్షణా కార్యక్రమం ద్వారా పాల్గొన్నవారు డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలి జెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ రంగాలలో తమ బోధన, పరిశోధన, సాంకేతిక నైపుణ్యాలను మరింతగా అభివృద్ధి చేసుకున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి వినూత్న విద్యా కార్యక్రమాలను నిర్వహించేందుకు అనురాగ్ విశ్వవిద్యాలయం కట్టుబడి ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈ అధ్యాపక శిక్షణా కార్యక్రమంలో తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, అస్సాం, పంజాబ్ రాష్ట్రాల అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొని కార్యక్రమానికి జాతీయ స్థాయిలో విశేష స్పందన లభించింది.