2 July, 2026 | 3:19 AM

‘విజయోత్సవ సభ’ను విజయవంతం చేయండి

02-07-2026 01:46 AM

మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ గుర్రం కేశవులు 

ఆమనగల్లు, జూలై 1 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల విజయాల వివరిస్తూ ఎంపీ డాక్టర్ మల్లు రవి ఆధ్వర్యంలో చేపట్టిన రెండు బస్సు యాత్రలు ముగిశాయి. ఈ సందర్భంగా ఈనెల 2న (గురువారం) కల్వకుర్తి పట్టణంలోని జూనియర్ కాలేజీ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభను విజయవంతం చేయాలని ఆమనగల్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గుర్రం కేశవులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

గత నెల 2న అలంపూర్ జోగులాంబ క్షేత్రం నుండి, మైసిగండి నుండి ప్రారంభమైన రెండు బస్సు యాత్రల ముగింపు సందర్భంగా ఈ విజయోత్సవ సభ జరుగుతోంది. ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిల నేతృత్వంలో జరిగే ఈ సభకు రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో పాటు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు జరవుతున్నారు.నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని నాయకులు కోరారు.