మంచి నీళ్ల కోసం మామను చంపిన కోడలు
హనుమకొండ: మంచి నీళ్ల కోసం ఓ కోడలు మామను హత్య చేసిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికంగా ఉంటున్న జల్లి సారయ్య(80) కుమారులు ఇద్దరు చనిపోయారు. దీంతో తన భార్యతో కలిసి పెద్ద కోడలు రమాదేవి ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో నివాసం ఉంటున్నారు.
వీళ్లు ఉంటున్న ఇంటికి ఒకే నల్లా కనెక్షన్ ఉంది. నల్లా వచ్చినప్పుడల్లా వీరి మధ్య గొడవలు జరుగుతుండేవి. ఆదివారం అదే విషయంలో వివాదం తలెత్తింది. అదికాస్త పెద్దది కావడంతో కోడలు రమాదేవి తన ఇద్దరు కొడుకులతో కలిసి సారయ్యపై దాడి చేసింది. ఈ దాడిలో సారయ్య నుదుటిపై బలంగా తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అత్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం ఇద్దరు కొడుకులతో సహా నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.






