14 July, 2026 | 7:34 AM

జీడిమెట్లలో ప్రమాదం: ఒకరు మృతి

19-05-2024 10:59 AM

హైదరాబాద్: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదం చోటుచేసుకంది. మద్యం మత్తులో వేగంగా వెళ్తూ బైకు పై నుంచి యువకులు కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.