11-08-2025 12:00:00 AM
- నిధులు విడుదల చేయని సర్కారు
- కొత్త మున్సిపాలిటీలలో బడ్జెట్ నిల్
- పట్టణాలలో ఎక్కడ చూసినా అపరిశుభ్రతే
మేడ్చల్, ఆగస్టు 10 (విజయ క్రాంతి): పరిశుభ్రత, ప్రజారోగ్యమే ప్రధాన లక్ష్యంగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో చేపట్టిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ జిల్లాలో మొక్కుబడిగా సాగుతోంది. ప్రభుత్వ నిర్దేశం మేరకు కార్యక్రమాలు సాగడం లేదు. జూన్ 2న ప్రారంభమైన యాక్షన్ ప్లాన్ సెప్టెంబర్ 10 వరకు అమలు కానుంది.
ఇప్పటివరకు 70 రోజులు అయింది. ఏ పట్టణంలో కూ డా ఆశించిన మేరకు కార్యక్రమాలు జరగ డం లేదు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి. వరద నివారణ చర్యలు తీసుకోవాలి. కళా ప్రదర్శనలు ర్యాలీలతో పాటు క్వి జ్, రంగోలి, చిత్రలేఖనం తదితర పోటీలు నిర్వహించాలి. కాలనీలు, రహదారుల పక్క న పిచ్చి మొక్కలు తొలగించాలి. రహదారుల మీద గుంతలు పూడ్చివేయాలి.
శిథిల భవనాలు పూడ్చడం వంటి కార్యక్రమాలు చేపట్టాలి. వీధి వ్యాపారాలను గుర్తించి వారికి రుణాలు ఇప్పించాలి. కొత్తగా పొదు పు సంఘాలు ఏర్పాటు చేయించి, రుణాలు ఇప్పించాలి. మురుగు కాలువలు, నాలాల్లో పూడిక తీయడం తదితర పనులు చేపట్టాలి. కానీ మున్సిపాలిటీలో, కార్పొరేషన్లలో ఇవే మీ చేయడం లేదు. జిల్లాలో నిజాంపేట్, జ వహర్ నగర్, బోడుప్పల్, పిర్జాదిగూడ ము న్సిపల్ కార్పొరేషన్ లు, మేడ్చల్, గుండ్ల పోచంపల్లి, కొంపల్లి, దుండిగల్, తూముకుం ట, ద్మగూడ, నాగారం, ఘట్కేసర్, పోచారం, ఎల్లంపేట, అలియాబాద్, మూడు చింతలపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి.
నిధులు విడుదల చేయని సర్కారు
వర్షాకాలం దృష్ట్యా 100 రోజుల యా క్షన్ ప్లాన్ తయారుచేసినప్పటికీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. జనరల్ ఫండ్ నుంచి ఖర్చు చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. కానీ కొత్తగా ఏర్పాటు అయిన మునిసిపాలిటీలలో సమస్యగా తయారయింది. కొత్త మున్సిపాలిటీల లో ఒక్క రూపాయి జనరల్ ఫండ్ లేదు. మేడ్చల్ జిల్లాలో ఎల్లంపేట, అలియాబాద్, మూడు చింతలపల్లి మున్సిపాలిటీలు ఏర్పాటయ్యాయి.
వాస్తవానికి ఇవి పట్టణాలు కావు. పూర్తిగా గ్రామీణ ప్రాంతాలు. ప్రత్యేక పరిస్థితుల్లో చిన్న చిన్న గ్రామాలు కలిపి ము న్సిపాలిటీలు ఏర్పాటు చేశారు. ఈ గ్రామాల్లోనే సమస్యలు ఎక్కువగా ఉన్నా యి. ప్ర స్తుతం వీటిలో వీధిలైట్లు పెట్టడానికి కూడా డబ్బులు లేవు. వందరోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించడానికి డబ్బులు లేవు.
కనిపించని మొక్కలు
వందరోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా వనమహోత్సవం కూడా నిర్వహించాలి. మొక్కలు నాటడమే కాకుండా మహిళా సంఘాల ఆధ్వర్యంలో నర్సరీలు ఏర్పాటు చేయాలి. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని పార్కులు, ఇళ్ల వద్ద, చెరువు కట్టలు, ఇతర కాలు స్థలాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టాలి. మున్సిపాలిటీలలో ఒకటి రెండు చోట్ల మొక్కలు నాటి చేతులు దులుపుకున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజారోగ్యంపై సరైన చర్యలు తీసు కోవడం లేదు. వందరోజుల యాక్షన్ ప్లాన్ ఉద్దేశం మంచిది అయిన సక్రమంగా నిర్వహించడం లేదు.