11-08-2025 12:00:00 AM
తెలంగాణలో ఎక్కడా లేని వర్షాలు ఇక్కడే ఎక్కువ తొర్రూర్‌లో 136 మిల్లీమీటర్లు, పెద్ద అంబర్‌పేట్‌లో 96.8 అలుగు పోస్తున్న పెద్ద అంబర్‌పేట్ ఈదుల చెరువు
అబ్దుల్లాపూర్‌మెట్, ఆగస్టు 10: తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కురవని వానలు రంగారెడ్డి జి ల్లా అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలోనే ఎక్కవ కురిశాయి. వర్షపాత నమోదులో అబ్దుల్లాపూర్‌మె ట్ మండలం మొదటి స్థానంలో నిలిచింది. పగలు పూట ఉడకపోయి.. సాయంత్రం పూట వాన లు దంచికొడుతున్నాయి. గడిచిన నాలుగుఐదు రోజులలో నమోదైన వర్షపాతం తొర్రూర్ 136 మిల్లీమీటర్లు, పెద్ద అంబర్‌పేట్‌లో 96.8, పసుమాములలో 67.8, అబ్దుల్లాపూర్‌లో 34.5 తుర్కయంజాల్‌లో 32.5, తట్టిఅన్నారంలో 23.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు తెలిసింది.
అలుగు పోస్తున్న ఈదుల చెరువు
రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని గత నాలుగు, ఐదు రోజులు నుంచి విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి తొర్రూర్‌లో ఎక్కవశాతం వర్షాలు పడడంతో కుంటలు, చెరువులు నిండి.. దిగువన ఉన్న పెద్ద అంబర్‌పేట్ ఈదుల చెరువులోకి ఆ వరద నీరు చేరడంతో చెరువు పూర్తిగా నిండి అలుగుపోయింది. దీంతో స్థానికు లు ఈదుల చెరువు వద్ద సందండిచేస్తున్నారు.