calender_icon.png 14 August, 2025 | 1:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపదలో అండగా నిలిచిన తోటి స్నేహితులు

11-08-2025 12:00:00 AM

మృతుని కుమార్తె పేరు మీద రూ. 50 వేలు ఫికస్డ్ డిపాజిట్ చేసిన స్నేహితులు 

 యాచారం ఆగస్టు 10: తమతోపాటు పదవ తరగతి వరకు కలిసి చదువుకున్న స్నేహితుడు హార్ట్ స్ట్రోక్ తో కొన్ని రోజుల క్రితం మృతి చెందాడు. 200809 పదవ తరగతి పూర్వ విద్యార్థుల్లో ఒకరైన యాచారం మండలంలోని చౌదర్ పల్లి గ్రామానికి చెందిన మారోజు సద్గుణ చారి కొన్ని  రోజులక్రితం హార్ట్ స్ట్రోక్ తో మృతి చెందాడు.

సద్గుణ చారి కి ఒక కూతురు , కుమారుడు ఉన్నారు. తోటి పూర్వ విద్యార్థులు అంతా ఏకమై తన కుమార్తె పేరు మీద రూ. 50 వేలు ది హైదరాబాద్ డిస్టిక్ కోపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో 15 సంవత్సరాలుగా డబ్బులు  ఫికస్డ్ డిపాజిట్ చేశారు. ఆదివారం రిసిప్ట్ ను సద్గుణ చారి భార్యకు అందజేశారు. దీనిపై గ్రామస్తులు హార్షం వ్యక్తం చేస్తున్నారు. స్నేహంలోనే కాదు ఆపదలో కూడా అండగా ఉంటామనినిరూపించారు.