7 March, 2026 | 6:42 AM

వయో వృద్ధుల సంక్షేమానికే డే కేర్ సెంటర్

07-03-2026 01:54 AM

మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు 

ఎంపీ రఘునందన్ రావు 

మెదక్, మార్చి 6(విజయక్రాంతి): మహిళా శిశు దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వయో వృద్ధుల సంక్షేమం కోసం డే కేర్ కేంద్రా న్ని మెదక్ మైనంపల్లి రోహిత్ రావు, మెదక్ ఎంపీ రఘునందనరావుల చేతు ల మీదుగా ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ.. తను సొంత నిధులతో బ్యాటరీ వెహికల్ ను అందిస్తామన్నారు. ఈ డే కేర్ సెంటర్ ద్వారా మెదక్ జిల్లాలోని వయోవృద్దులు వారి యొక్క వారి కాలక్షేపం కొరకు వయోవృద్దులు అడుకునే ఆట సామగ్రి, వార్తా పత్రికలు, పుస్తకాలు, అలాగే వారికి సరదాగా వంట చేసుకుని తినడానికి వంట సామగ్రి కూడా అందుబాటులో ఉంటుందని, వయోవృద్దులు వారి శేష జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్న వాటన్నిటిని వదిలి ఈ డే కేర్ సెంటర్ లో అందరు వయోవృద్ధుల తో సంతోషంగా ఉండవచ్చని వారు తెలియజేశారు.

ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. వయో వృద్ధుల సంక్షేమానికే అధికా రులందరూ పని చేయాలన్నారు. ఈ డే కేర్ కేంద్రాన్ని సేవాసంఘం స్వచ్చంద సంస్థ వారిచే మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని వారు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమలో మెదక్ మున్సిపల్ చైర్మన్ కానుగు రాధిక భూపతి రాజ్, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, సేవా సంఘం స్వచ్చంద సంస్థ నుండి సతీష్, శ్రీధర్, సెక్షన్ అధికారి జింక రవీందర్ అలాగే మెదక్ జిల్లాలోని వయోవృద్ధులు పాల్గొన్నారు.