7 March, 2026 | 6:42 AM

హైకోర్టు ఆదేశాలు వెంటనే అమలు చేయాలి

07-03-2026 01:53 AM

తెలంగాణ ఉద్యమకారుల దళిత ఫోరమ్

ముషీరాబాద్, మార్చి 6(విజయక్రాంతి): హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల దళిత ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు కర్రే సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. 

శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో  మీడియా సమావేశంలో ప్రధాన కార్యదర్శి పి.రామన్నతో కలసి ఆయన మాట్లాడారు. ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కృషి చేయాలన్నారు.  ఈ సమావేశంలో డాక్టర్ టి. వంశ తిలక్, బాలయ్య, మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.