calender_icon.png 21 November, 2025 | 3:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిసిసి అధ్యక్షురాలి జన్మదిన వేడుకలు

21-11-2025 03:12:00 PM

మంచిర్యాల, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు జన్మదిన వేడుకలు శుక్ర వారం కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసంలో మంచిర్యాల కార్పోరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబురాలు జరిపారు. అనంతరం  మంచిర్యాల ప్రభుత్వ హాస్పిటల్ లో పేషెంట్లకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సల్ల మహేష్, కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాళ్ళు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.