21-11-2025 03:13:13 PM
మందమర్రి, (విజయక్రాంతి) : మంచిర్యాల డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు జన్మదిన వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం పట్టణంలో పీసిసి సభ్యులు నూకల రమేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూకల రమేష్ మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి డిసిసి అధ్యక్షురాలుగా సురేఖమ్మ పార్టీ విశేష కృషి చేశారని, జిల్లాలో మూడు నియోజక వర్గాలను అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించారని ఆమె సేవలను కొనియాడారు. జిల్లాలో భారత్ జోడో యాత్ర, ఆజాద్ కి గౌరవ్ యాత్ర, రాజీవ్ సద్భావన యాత్ర, వంటి కార్యక్రమాలు వందల కిలో మీటర్లు చేపట్టి, పాదయాత్ర వంటి కార్యక్రమాలను విజయవంతం చేసి పార్టీని జిల్లాలో మూడు నియోజక వర్గాల్లో గెలుపునకు కృషి చేశారన్నారు. అహర్నిశలు కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ, పేద బడుగు బలహీనవర్గాల వారికి అండగా నిలిచారన్నారు. సురేఖమ్మ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి మాజీ కార్యనిర్వా హక కార్యదర్శి ఎండి ముజాహిద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సిద్ధం జనార్దన్, సీనియర్ జిల్లా నాయకులు నర్సోజీ, యువజన కాంగ్రెస్ నాయకులు నరేందర్, రంజిత్, నవీన్, కిరణ్, సతీష్, సురేష్, అనిరుద్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.