calender_icon.png 21 November, 2025 | 3:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే డా.పాల్వాయి

21-11-2025 03:10:47 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): దహేగాం మండల కేంద్రంలో ని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం, ఐకేపి ఆధ్వర్యంలో నిర్వహించే రెండు వరి కొనుగోలు కేంద్రాలను సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు అమ్మాలని, తద్వారా మద్దతు ధరతో పాటు బోనస్ పొందవచ్చని తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన మీదట అభివృద్ధి పనులను చేపట్టనున్నామని, అందులో భాగంగా కల్వాడ నుండి ఒడ్డుగూడ వరకు రూ.41 కోట్ల అంచనాతో బ్రిడ్జిలతో సహా డబుల్ బీటీ రోడ్ నిర్మించనున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డీఆర్డిఓ దత్తారావు, డిసీఎస్ఓ వసంత లక్ష్మీ, జిల్లా వ్యవసాయ అధికారి బోర్కుట్ వెంకటి, ఏడీఓ మనోహర్, మార్కేట్ కమిటీ చైర్మన్ దేవయ్య, సింగిల్ విండో చైర్మన్ తిరుపతి గౌడ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ ధనుంజయ్, మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ, పీఏసీఎస్ అధికారి, సామ్యూల్, ఎమ్మార్వో షరీఫ్, ఏపీఎం ప్రకాష్, సీఈఓ బక్కన్న, ఎంసి ధన్ రాజ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోగన్న, ఆర్ఐ నాగభూషణం, ఏఈఓ లావణ్య, పంచాయతీ కార్యదర్శులు రాజేష్, ప్రణీత్, భాజపా మండల అధ్యక్షులు దామోదర్, రైతులు, భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.