calender_icon.png 17 September, 2025 | 9:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గాన్ని సన్మానించిన డీసీసీ అధ్యక్షుడు

17-09-2025 07:15:56 PM

మేడ్చల్ (విజయక్రాంతి): మేడ్చల్ మండల ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి సన్మానించారు. బుధవారం మేడ్చల్ పట్టణంలోని డీసీసీ కార్యాలయంలో శాలువాలతో సన్మానించారు. ఈ సందర్బంగా హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయాలన్నా, ప్రజా సమస్యలు ప్రభుత్వ దృష్టికి రావాలన్నా జర్నలిస్ట్ వల్లే అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మండల ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ అధ్యక్షులు సత్యపాల్ రెడ్డి, జనరల్ సెక్రటరీ వెంకట్, ఉపాధ్యాక్షులు ఖాజా, మాజీ అధ్యక్షుల మహేష్, సభ్యులు గోపాల్ , విశ్వ, ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.