27 August, 2026 | 3:18 AM

ఆమోదయోగ్యమైన వ్యక్తికే ‘డీసీసీ’ బాధ్యతలు

27-08-2026 12:39 AM

డీసీసీ ఎన్నికల అబ్జర్వర్ సి.వి. మోహన్

మొయినాబాద్, ఆగస్టు 2 6 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా డీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపికపై చేవెళ్ల నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో మొయినాబాద్లో సంప్రదింపుల సమావేశం నిర్వహించారు. కర్ణాటక ఎమ్మెల్సీ, ఏఐసీసీ డీసీసీ ఎన్నికల అబ్జర్వర్ సి.వి. మోహన్ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.

పై నుంచి నిర్ణయాలు రుద్దకుండా, అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తికే డీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించేలా ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చే శారు. ప్రతి గ్రామంలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ను మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి, చేవెళ్ల ఇన్చార్జి భీమ్భరత్, ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈ.వి. శ్రీనివాస్రావు, గౌరీ సతీష్, బొలిగిద్ద సత్యనారాయణ, విక్రమ్రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.