ఘనంగా మిలాద్ -ఉన్ -నబీ వేడుకలు
రంగారెడ్డి, ఆగస్టు 26 (విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. జిల్లాలోని షాద్నగర్, ఆమనగల్, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, చేవెళ్ల, శేర్లింగంపల్లి, ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు, భారీ ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మున్సిపల్ చైర్మన్ అగునూరు బసవేశ్వర్ సహా ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
మహమ్మద్ ప్రవక్త చూపిన శాంతి, సమైక్యత, మానవత్వాల మార్గంలో నడుస్తూ మతసామరస్యాన్ని కాపాడుకోవాలని నేతలు పిలుపునిచ్చారు. పండుగను పురస్కరించుకుని పలు ప్రాంతాల్లో అన్నదానం, పండ్ల పంపిణీ, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. పోలీసు యంత్రాంగం గట్టి బందోబస్తు నిర్వహించడంతో వేడుకలు ప్రశాంతంగా ముగిసాయి






