గల్లీ సమస్యలు ఢిల్లీ దాకా తీసుకెళ్తా..
పీవీ మోహన్
మొయినాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): కనకమామిడి దళితవాడలో కాంగ్రెస్ నాయకులు బుధవారం పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కర్ణాటక ఎమ్మెల్సీ, ఏఐసీసీ సెక్రటరీ అబ్జర్వర్ పీవీ మోహన్, సత్తుపల్లి ఎమ్మెల్యే డా. రాఘమయి, పీసీసీ సెక్రటరీ శ్రీనివాస్, చేవెళ్ల కాంగ్రెస్ ఇన్చార్జి పామెన భీమ్భరత్ దళిత కుటుంబాలను కలిశారు. రాఖీ పండుగ సందర్భంగా దళిత మహిళలు పీవీ మోహన్కు రాఖీలు కట్టి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఈ సందర్భంగా పీవీ మోహన్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను ఢిల్లీ వరకు తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా, రంగారెడ్డి డీసీసీ అధ్యక్ష పదవిని పామెన భీమ్భరత్కు ఇవ్వాలని దళితవాడ ప్రజలు కోరారు. కార్యక్రమంలో గౌరీ సతీష్, బోలిగిద్ద సత్యనారాయణ, మాణయ్య, మర్రి రవీందర్రెడ్డి, బాలకృష్ణరెడ్డి, రఘురామ్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.






