calender_icon.png 13 July, 2025 | 11:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా డీసీసీబీ చైర్మన్ జన్మదిన వేడుకలు

13-07-2025 04:22:43 PM

కొండపాక (విజయక్రాంతి): డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి 53వ జన్మదినం పురస్కరించుకొని ఆదివారం వెలికట్ట ఎక్స్ రోడ్డు వద్ద పాక్స్ డైరెక్టర్ బూర్గుల సురేందర్ రావు ఆధ్వర్యంలో దుద్దెడ స్వయంభూదేవులింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తమ నాయకుడు రాజకీయ అభివృద్ధి చెందాలని ఎల్లవేళల ఆ భగవంతుణ్ణి ఆశీస్సులతో సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ బట్ట పర్ష రాములు, మండల అధ్యక్షుడు వాసరి లింగరావు, మంచాల కనకరాములు సుదర్శన్ మాజీ సర్పంచ్ మహదేవ్ ఆరేపల్లి శ్రీనివాస్ రేపాక స్వామి గంగుల వేంకటేశం అఖిల్ సిద్దులు చిరంజివి జాని అంజి శంభయ్య నరేష్ లు, సీడీర్ సేనా సభ్యులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.