calender_icon.png 14 July, 2025 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీడియా కార్యాలయంపై దాడి అమానుషం

13-07-2025 10:33:23 PM

మున్నూరుకాపు సంఘం జిల్లా నాయకులు బొడ్డు ఏసుబాబు..

మణుగూరు (విజయక్రాంతి): జాగృతి అల్లరి మూకలు క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చేయడం అమానుషమని మున్నూరుకాపు సంఘం జిల్లా నాయకులు బొడ్డు ఏసుబాబు(Munnurukapu Sangam District Leader Boddu Yesubabu) అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మీడియా సంస్థలపై దాడి చేయడం అత్యంత దారుణమైన చర్యగా అభివర్ణించారు. దాడులతో మీడియా స్వేచ్ఛను ఆపాలనే ప్రయత్నం ప్రజాస్వామ్యానికి పెద్దదెబ్బ అని స్పష్టం చేశారు. మీడియా పట్ల రాజకీయ పార్టీల నాయకులు విధేయత చూపాలని, అలాకాకుండా భౌతిక దాడులకు దిగడం సరైన పద్ధతి కాదన్నారు. క్యూ న్యూస్ కార్యాలయంలో సిబ్బంది, ఎమ్మెల్సీ మల్లన్నపై దాడులు చేసేవారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని కోరారు.