13-07-2025 11:08:39 PM
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తూముల సురేష్ రావు..
పెన్ పహాడ్: రేపు తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పట్టణంలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తూముల సురేష్ రావు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాలకు మూడు పూటలా సన్న బియ్యంతో ఆకలి తీర్చేందుకు ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం తలపెట్టడం శుభ పరిణామం అన్నారు. రేషన్ కార్డులు పంపిణీ అనంతరం రాష్ట్రంలో 95 లక్షల కుటుంబాలకు గాను 3 కోట్ల 10 లక్షల మంది నిరుపేదలకు రేషన్ లబ్ది పొందనున్నట్లు ఆయన తెలిపారు.
బంగారు తెలంగాణనని గొప్పలు చెప్పుకున్న ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్ల హయంలో రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క నిరుపేదకూ రేషన్ కార్డు పంపిణీ జరగపోవడం సిగ్గు చేటన్నారు. కేసీఆర్ పాలనకు ముందు.. పదేండ్ల పాలన తరువాత రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనను అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదిస్తున్నారన్నారు. తిరుమలగిరి సభను విజయవంతం చేయడానికి మండలంలోని ప్రతి గడప నుంచి ఒక్కరు చొప్పున మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, తూముల భుజంగరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సభకు కదలిరావాలని ఆయన కోరారు.