calender_icon.png 14 July, 2025 | 5:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెరిక కుల ఆత్మగౌరవ భవనం పూర్తి చేసి ఐక్యతను చాటుకోవాలి

13-07-2025 11:21:44 PM

పెరిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మద్ద లింగయ్య..

సూర్యాపేట (విజయక్రాంతి): పెరిక కులస్తులంతా ఎక్కడా ఉన్నా కలసికట్టుగా ముందుకుసాగుతూ జిల్లా కేంద్రంలో పెరిక కుల ఆత్మగౌరవ భవన నిర్మాణం పూర్తి చేసి ఐక్యతను చాటాలని తెలంగాణ రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షులు మద్దా లింగయ్య అన్నారు. ఆదివారం రోజు పల్లి సమీపంలో గల ప్రతిష్ట బీఫార్మసీ కళాశాలలో జరిగిన పెరిక సంఘం సూర్యాపేట పట్టణ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సూర్యాపేట పట్టణ నూతన కార్యవర్గం ప్రతి ఒక్కరిని కలుపుకొనిపోతూ సీనియర్ల సలహాలతో సంఘ పటిష్టతకు పాటుపడాలన్నారు.

తదుపరి కోకాపేట పెరిక భవన నిర్మాణ కమిటీ చైర్మన్ గటిక విజయ్ కుమార్ మాట్లాడుతూ.. సంఘం కోసం పనిచేసే  వారికి ఎలాంటి లాభాపేక్ష ఉండదని ఒక్కో సమయంలో తమ సొంత డబ్బులు పెట్టుకొని కూడా సంఘానికి సేవ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. రెండు రాష్ట్రాలకు వారధిగా ఉన్న సూర్యాపేట జిల్లా కేంద్రంలో జాతీయ రహదారి వెంట పెరిక కుల ఆత్మగౌరవ భవనాన్ని యావత్ తెలంగాణాకు ఆదర్శంగా నిర్మించుకోవాలన్నారు.

అనంతరం పట్టణ సంఘం గౌరవాధ్యక్షులుగా బంధు వీరయ్య, అధ్యక్షులుగా పత్తిపాక వేణుధర్, సహాయ అధ్యక్షులుగా యర్రంశెట్టి రామలింగయ్య, ప్రధాన కార్యదర్శిగా పోతరాజు నర్సయ్య, కోశాదికారిగా సోమిశెట్టి లింగయ్య, సంయుక్త కార్యదర్శిగా నట్టె కిరణ్ కుమార్, ప్రచార కార్యదర్శిగా దేవరగట్ల సతీష్ లు ఏకగ్రీవంగా ఎన్నికకాగా వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, హైద్రాబాద్ పెరిక హాస్టల్ మాజీ అధ్యక్షులు అంగిరేకుల నాగార్జున, ప్రతిష్ట బిఫార్మసి కళాశాల చైర్మన్ డాక్టర్ మిన్న శివరామకృష్ణ,  సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సుంకరి ఆనంద్, పెరిక విద్యార్థి వసతి గ్రుహ చైర్మన్ డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధికార ప్రతినిది సుందరి విజయభాస్కర్, టీపీసీసీ మెంబర్ దొంగరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.