13-07-2025 10:42:35 PM
సిర్గాపూర్: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని గోసాయిపల్లి గ్రామానికి నూతన రోడ్డు పనులను ఆదివారం ఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి(MLA Dr. Patlolla Sanjeeva Reddy) పరిశీలించారు. రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యేతో గ్రామానికి చెందిన పెద్దలు, యువకులు మాట్లాడుతూ... ఈ రోడ్డు మా తాతల, మా యొక్క తండ్రుల నాటి-కల మా గ్రామానికి రోడ్డు కావాలని అట్టి కలను నిజం చేసినందుకు గ్రామం తరపున ఎమ్మెల్యే సంజీవరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు గోసాయిపల్లి గ్రామ ప్రజలు, పెద్దలు, యువకులు, సిర్గాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.