13-07-2025 10:46:25 PM
మేడ్చల్ అర్బన్: మేడ్చల్ మున్సిపాలిటీ(Medchal Municipality) పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో భారత వికాస్ జనరిక్ మందుల నూతన షాప్ భారత్ వికాస్ పరిషద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బీజేపీ మున్సిపాలిటీ అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్, అశ్విని సుబ్బారావు, ట్రస్ట్ సభ్యులు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జల్లి శైలజ హరినాథ్ మాట్లాడుతూ.. జనరిక్ మెడిసిన్ నాణ్యమైనదని, జనరిక్ మెడికల్ షాపులో 30% నుండి 80% వరకు మందుల ఖర్చులను తగ్గించుకోవచ్చు, ఈ షాపులో అనుభవజ్ఞులైన ఫార్మసిస్టులు అందుబాటులో ఉంటారని అన్నారు.
కార్యక్రమంలో మేడ్చల్ మాజీ సర్పంచ్ తాళ్ళపల్లి మురళీధర్ గుప్త, ఎల్లంపేట్ మున్సిపాలిటీ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్, మేడ్చల్ మున్సిపాలిటీ బీజేపీ ప్రధాన కార్యదర్శి కానుకంటి వంశీ విజయ్ వంజరి, ప్రేమదాస్, మేడ్చల్ మున్సిపాలిటీ బీజేపీ ఉపాధ్యక్షులు మైసరి రాజు వంజరి, లవంగ శ్రీకాంత్, జకట బాబు రాజు, జకట బాలకృష్ణ, బొజ్జ వంశీ రెడ్డి, కవిరాజు, జె.నర్సింగ్, పుష్ప మల్లారెడ్డి, కానుకంటి భరత్ వంజరి, కేశవ రెడ్డి, మామిళ్ళ నర్సింగ్ రావు, చీర్ల సత్యనారాయణ, పతంజలి కిషోర్, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.