14-08-2025 12:00:00 AM
యాదాద్రి డీఈవోకు బి స్మార్ట్ యాదాద్రి జిల్లా కమిటీ వినతి
యాదాద్రి భువనగిరి, ఆగస్టు 13 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా డీసీఈబీ పరీక్ష ఫీజు నల్లగొండ జిల్లా ఫీజు కన్నా ఎక్కువగా ఉన్నందున తగ్గించాలని విజ్ఞప్తి చేస్తూ బీ స్మార్ట్ యాదాద్రి జిల్లా కమిటీ డీఈవోకు విజ్ఞప్తి చేసింది. ఫీజు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.
ఈ సందర్భంగా డీఈవో ఆఫీస్ ఏడీ ప్రశాంత్‌రెడ్డితో యూనియన్ నాయకులు ఫీజు తగ్గింపుపై బుధవారం సమావేశమై చర్చించారు. బి స్మార్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడాల జలంధర్‌రెడ్డి ఆధ్వర్యంలో అధ్యక్షుడు మిర్యాల దుర్గాప్రసాద్, సెక్రెటరీ చిట్టిబాబు, ట్రెజరర్ ప్రభాకర్‌రెడ్డి, రవీందర్, ప్రేమ్‌రెడ్డి అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు.