13-08-2025 11:21:46 PM
కామారెడ్డి (విజయక్రాంతి): ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల(Government Arts and Science College) కామారెడ్డి పీజీ ద్వితీయ సంవత్సర నాల్గవ సెమిస్టర్ ఫలితాలను బుధవారం తెలివి పరీక్షలు నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కే.సంపత్ కుమార్, ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే విజయ్ కుమార్ వెల్లడించినట్టు కళాశాల పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ కె. కిష్టయ్య తెలిపారు. కళాశాల స్వయం ప్రతిపత్తి హోదా పొందిన తరువాత మొదటి బ్యాచ్ విద్యార్థులు 95 శాతం ఉత్తీర్ణత సాధించారని, ఉత్తమ ఫలితాలు సాధించినందుకు, అధ్యాపకులను, విద్యార్థులను ప్రిన్సిపల్ అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలివి పీజీ అదనపు పరీక్షల నియంత్రణ అధికారి సంపత్ కుమార్, కళాశాల అదనపు పరీక్షల నియంత్రణ అధికారులు ఏ రాజేందర్, ఎన్.రాములు పాల్గొన్నారు.