పుష్కరఘాట్ ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ
లక్షెట్టిపేట, జూలై 20 : పట్టణంలోని గోదావరి వద్ద వచ్చే ఏడాది ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్న పుష్కరాల ఏర్పాట్లను మంచిర్యాల డీసీపీ భాస్కర్ సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ పుష్కరాల ఏర్పాట్లను వేగవంతం చేయాలన్నారు. వివిధ శాఖల అధికారులు, పోలీస్ శాఖ అధికారుల సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయాలని, అంతే కాకుండా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. సాధ్యమైనంత మేరకు పార్కింగ్ స్థలాన్ని గోదావరికి కాస్త దూరంలో ఉంచాలని తహసీల్దార్ దిలీప్ కుమార్ తో చర్చించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎలాంటి క్రైమ్ జరగకుండా ముందస్తు చర్యలు తీసు కోవాలని పోలీస్ సిబ్బందికి మార్గ నిర్దేశం చేశారు. పుష్కరాల ఏర్పాట్లపై పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ పరిశీలనలో డీసీపీ వెంట మంచిర్యాల ఏసీపీ ప్రకాష్,తహసీల్దార్ దిలీప్ కుమార్,సీ ఐ రమణమూర్తి, ఎస్త్స్ర గోపతి సురేష్, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.






