భారత ఉప ప్రధాని స్వర్గీయ బాబూజగ్జీవన్ రామ్ వర్ధంతి
దళితుల ఓటు హక్కుల కోసం పోరాడిన యోధుడు జంపన ప్రతాప్
సికింద్రాబాద్, జూలై 6 (విజయక్రాంతి): న్యూ బోయినపల్లి నక్కలపల్లి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం భారత ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముప్పిడి మధుకర్ హాజరై జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంటరాని వారి శ్రేయస్సు కోసం అణగారిన వర్గాల అభ్యున్నతికి బాబు జాగ్జీవన్ రామ్ విశేషంగా కృషి చేసారని సామాజిక సమాన త్వం. దళితుల ఓటు హక్కుల కోసం పోరాడిన యోధుడని జంపన ప్రతాప్ అన్నారు. ఈ కార్యక్రమంలో సీతారామ్, యాదగిరి,ముకేశ్ యాదవ్, పరమేష్, వరప్రసాద్, నేతా నాధ్ సాయి, క్రాంతి పాల్గొన్నారు.






