హుస్సేన్‌సాగర్ ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలపై తనిఖీ
07-07-2026 12:00 AM
- హైడ్రా జీహెచ్ ఎంసీ కమిషనర్లతో పాటు కలెక్టర్ సంయుక్త విచారణ
- ఇరిగేషన్ శాఖ ఫిర్యాదు మేరకు అధికారుల పరిశీలన
సికింద్రాబాద్, జూలై 6 (విజయక్రాంతి): హుస్సేన్‌సాగర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలు జరుగుతున్నట్టు వచ్చిన ఫిర్యాదులను హైడ్రా, జీహెచ్ ఎంసీ కమిషనర్లు ఏవీ రంగనాథ్, ఆర్ వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ డా.ప్రియాంక అలా నేతృత్వంలో అధికారుల బృందం సోమవారం పరిశీలించారు.
తమ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేపట్టారని ఇరిగేషన్ శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారుల బృందం క్షేత్రస్థాయిలో విచారించింది. ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ చేపట్టిన భవన నిర్మాణానికి తమ నుంచి ఎలాంటి అనుమతులు లేవని ఇరిగేషన్ శాఖ ఈ సందర్భంగా తెలిపింది. ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణ అనంతరం సంబంధిత రికార్డులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారుల బృందం వెల్లడించింది.






