12 August, 2026 | 1:33 AM

పెన్షనర్ల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి

12-08-2026 12:21 AM
  1. టీఏపీఆర్‌పీఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సముద్రాల లక్ష్మీనారాయణ
  2. వరంగల్‌లో పెన్షనర్ల అవగాహన సదస్సు

వరంగల్ (మహబూబాబాద్), ఆగస్టు 11 (విజయక్రాంతి): పెన్షనర్ల బకాయిలు, పీఆర్సీ, డీఏలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఎన్‌ఈహెచ్‌ఎస్) కార్డుల అమలులో సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టీఏపీఆర్పీఏ) డిమాండ్ చేసింది. మంగళవారం వరంగల్ ఏసీ రెడ్డి నగర్లోని సీపీఎం కార్యాలయంలో టీఏపీఆర్పీఏ వరంగల్ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సముద్రాల లక్ష్మీనారాయణ అధ్యక్షతన  సదస్సు నిర్వహించారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్‌ఈహెచ్‌ఎస్ బోర్డు సభ్యులు పాలకుర్తి కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పెండింగ్ ఎరియర్స్, పీఆర్సీ, డీఏ, హెల్త్ కార్డుల సమస్యలపై చర్చించారు. పెన్షనర్లు తమ హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తూరి ప్రభాకర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు బోనాల రాజమౌళితో పాటు వివిధ జిల్లాల, రాష్ట్ర బాధ్యులు, పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు, డిపెండెంట్ పెన్షనర్లు పాల్గొన్నారు.