23 May, 2026 | 10:23 PM

డాక్టర్ ముత్యం మృతి

21-08-2024 06:24 AM
  1. ‘శ్రీకాకుళం ఉద్యమం  -తెలుగు సాహిత్యంపై ప్రభావం’ పై పీహెచ్‌డీ  
  2. చారిత్రక ప్రామాణికంగా పాణిగ్రాహిపై పుస్తకం  
  3. మంగళవారం ముగిసిన  అంత్యక్రియలు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 20 (విజయక్రాంతి): తెలుగు సాహిత్య పరిశోధన ల్లో ఆణిముత్యంగా కీర్తి పొందిన డా.కె. ముత్యం మంగళవారం ఉదయం 2.-30 గం టలకు హైదరాబాద్ లింగంపల్లిలోని గుల్‌మోహర్ కాలనీలోని తన స్వగృహంలో అంతిమ శ్వాస విడిచారు. 1958 ఏప్రిల్ 14న నిజామాబాద్ జిల్లా బాచినపల్లిలో ఆయన జన్మించారు. డా.ముత్యం 1980 మధ్య ప్రగతిశీల ఉద్యమం బావుటాగా, ఆర్ట్స్ కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షుడు గా, పీడీఎస్‌యూ నాయకుడిగా నాటి యూ నివర్సిటీ  ప్రగతిశీల ఉద్యమానికి పునాది వేశారు.

శాతవాహన యూనివర్సిటీలో తెలుగు అధ్యాపకులుగా ఉద్యో గం చేసి, పదవీవిరమణ పొంది నప్పటికీ ఆయన జీవితకాలమంతా సాహి త్య పరిశోధకుడిగా పనిచేశారు. ‘శ్రీకాకుళం ఉద్యమం  తెలుగు సాహిత్యంపై ప్రభావం’ అనే అంశం పై పరిశోధన చేసి 1990లో ఆయన” బెస్టు థీసీస్‌” అవార్డుతో పీహెచ్‌డీ పట్టా పొందా రు. ఆయన పరిశోధనాంశాన్ని “శ్రీకాకుళ ఉద్యమం సాహిత్యం” పేరుతో పుస్తకం తెచ్చారు. తన జీవితకాలమంతా ప్రజా పరిశోధకుడిగా, చిత్రకారుడిగా, నిత్యసాహిత్య ప్రభావశీలిగా నిలిచారు. ముఖ్యం గా డా. ముత్యం పరిశోధనలు, రచనలు రెండు భాగాలుగా మనం చూడవచ్చును. 

1)ఉత్తరాంధ్ర సాహిత్య పరిశోధనా-రచనలు 

2) తెలంగాణా ప్రాంతం రచనలు, సేకరణ లు, సంపాదక కృషి. ”కమ్యూనిస్టులం -మేం కష్టజీవులం”అంటూ  పాటలు రాసిన పాణిగ్రాహిపై డా.ముత్యంరాసిన పుస్తకం చారిత్రక ప్రామాణికంగా నిలిచింది. మంగళవారం మధ్యా హ్నం 4 గంటలకు ఆయన అంత్యక్రియలు లింగంపల్లిలో జరిగాయి. సీపీఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, ఆ పార్టీ సీనియర్ నాయకులు రమా, కేజీ రాంచందర్, హన్మేష్, విప్లవ పార్టీ నాయకులు, రచయితలు డా.ముత్యం అత్యక్రియలలో పాల్గొని ఆయనకు నివాళ్లు అర్పించిన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు.