1 April, 2026 | 7:16 PM

Breaking News

కేంద్రమంత్రి బండి సంజయ్ నగర ప్రజలకు క్షమాపణ చెప్పాలి   •   మురుట్ల పాఠశాలకు బాన్వి-ప్రహర్ష పౌండేషన్ టీవీ అందజేత   •   కరాటే పోటీలలో వివిధ స్థాయిలలో బెల్టులు సాధించిన సిద్దార్థ పాఠశాల విద్యార్థులు   •   అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్ కె.హరిత   •   అంబేద్కర్ సెంటర్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల   •   అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన 14వ డివిజన్ కార్పొరేటర్ గడ్డి ప్రదీప్   •   మున్సిపల్ చైర్ పర్సన్ నివేదితను కలిసిన ఆర్యవైశ్యులు   •   గర్రెపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం   •   హైదరాబాద్ డివై డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రావణ్ కుమార్   •  

200 దాటిన మృతుల సంఖ్య

11-04-2025 12:23 AM

డొమినికన్ రిపబ్లిక్‌లో పైకప్పు కూలిన ఘటన

శాంటోడొమింగో: డొమినికన్ రిపబ్లికన్ దేశ రాజధాని శాంటో డొ మింగోలోని ఓ నైట్ క్లబ్ పైకప్పు కూలిన ఘటనలో మృతి చెందిన వా రి సంఖ్య 200 దాటింది. డొమినికన్ రిపబ్లిక్ అధికారులు సహాయక చర్యలను పూర్తి చేశారు. మంగళవారం తెల్లవారు జామున ఈ పైకప్పు కూలింది. ప్రసిద్ధ గాయకుడు రూబీపెరెజ్ ప్రదర్శన సందర్భంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

గాయకు డురూబీ పెరెజ్ కూడా మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఆయన మృతదేహాన్ని బుధవారం కనుగొన్నారు. ‘రెండు రోజులుగా రెస్క్యూ బృందాలు నిరంతరాయంగా సేవలందించాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చాయి.’ అని దేశ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ విభాగం ఎక్స్‌లో పేర్కొంది.