22 June, 2026 | 3:18 AM

మానవత్వమా.. నీ చిరునామా ఎక్కడ..?

22-06-2026 01:59 AM

కన్న పిల్లలను కడతెర్చిన తల్లి.. ఇద్దరు చిన్నారులు మృతి

ఫాదర్స్ డే నాడు ఓ తండ్రికి తీవ్ర శోకం

ఖమ్మం, జూన్ 21(విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలో అత్యంత దారుణం జరిగింది.. మానవత్వం మంటగలిచింది.. మాతృదేవోభవ అనే పదానికి అర్థం లేకుండా చేసింది.. కన్న కష్టం కోర్చి బిడ్డలను సాకుకునే తల్లులున్న నేటి భారతంలో కడుపునుంచి కన్న బిడ్డలను కడతేర్చిన ఓ తల్లి.. తాను ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషాదకర సంఘటన ఆదివారం ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది.

పాదర్స్ డే రోజున కన్న తండ్రికి  తీవ్ర శోకం మిగిల్చిన ఆ తల్లి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుపూర్తి వివరాల్లోకి వెళ్తే ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గుర్రాలపాడు గ్రామానికి చెందిన లింగరాజు, స్వాతి దంపతులు ఖమ్మం త్రీ టౌన్ పరిధిలోని గాంధీనగర్లో నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమారులు వేదిక్ కుమార్(7), తనిష్క్(5)లతో కలిసి నివాసం ఉంటున్నారు. లింగరాజు స్థానికంగా ఓ సెల్ షాపులో పనిచేస్తున్నాడు.  గత కొంత కాలంగా కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు గొడవ పడుతున్నారు. ఏం జరిగిందో ఏమో కానీ.. ఆదివారం తల్లి స్వాతి ఇద్దరు పిల్లలకు ఎలుకల మందు తినిపించి, తానూ తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 

ఫుడ్ పాయిజన్ అంటూ నమ్మబలికే ప్రయత్నం చేసినా తల్లి..

బిస్కెట్ లోఎలకల ముందు కలిపి ఇద్దరి పిల్లలకు తినిపించిన భార్య స్వాతి తన భర్తకు పోన్ చేసి పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయ్యిందని నమ్మబలికింది. పిల్లల పరిస్థితి సీరియస్ గా ఉందని, త్వరగా రావాలని పోన్ లో చెప్పింది. దీంతో హుటాహుటిన ఇంటికి చేరుకున్న లింగరాజు  ట్యాబిలెట్లు వేయించి ఇంట్లో పడుకోబెట్టాడు.

దీంతో నిద్రపోయిన ఇద్దరిలో ఒకరు అక్కడే చనిపోగా, మరోకిరికి, భార్యకు తీవ్ర వాంతులు కావడంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందగా, భార్య చికిత్స పొందుతుంది. సంఘటన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.