24 April, 2026 | 2:49 AM

ఫిరాయింపు చట్ట వ్యతిరేకం

27-06-2024 12:33 AM

స్పీకర్‌కు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ‘ఈ మెయిల్’

హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): తమ పార్టీ బీ గెలిచిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సంజయ్‌కుమార్ కాంగ్రెస్‌లో చేరడం చట్ట వ్యతిరేకమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి పేర్కొన్నా రు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఈ మెయిల్ ద్వారా స్పీకర్‌కు లేఖలు పంపినట్లు పేర్కొన్నారు. స్పీకర్‌ను నేరుగా కలిసేందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని చెప్పారు. స్పీకర్ స్పందించకపోతే న్యాయపరంగా ముందుకు వెళ్తామని తెలిపా రు. ఫిరాయింపులను ప్రోత్సహించిందే కాంగ్రెస్ అని, అవి సి గ్గుమాలిన పనులంటూ ఆ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డే చెప్తున్నారని విమర్శించారు.