గోద్రా అల్లర్ల సంగతేంటి మోదీజీ!
పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంతరావు
హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ కి ప్రతిసారి ఎమెర్జెన్సీపై మాట్లాడటం అలవాటైపోయిందని పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంతరావు విమర్శించారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు గోద్రా అల్లర్లు జరిగాయ ని, అప్పుడు ఒక వర్గంపై ఊచకోత జరిగిన విషయం అందరికీ తెలుసని గుర్తుచేశారు. గాంధీభవన్‌లో బుధవారం మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఇంకోసారి ఎమర్జెన్సీ విషయంపై మాట్లాడితే తాము గోద్రా అల్లర్లపై మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించా రు. కేవలం ఇందిరాగాంధీ మీద కక్షతోనే మాట్లాడుతున్నారని, దేశం కోసం ఆమె ప్రాణాలు ఇచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలని వీహెచ్ తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉం టేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని, ప్రజాస్వామ్యం పదిలంగా ఉంటుందన్నారు. బీసీ అని చెప్పుకుని మోదీ కులగణన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కులగణన చేస్తేనే బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు.






