తార్నాకలో రూ.2 లక్షల విలువ చేసే డిఫెన్స్ మద్యం పట్టివేత..
కర్ణాటక హర్యానా డిఫెన్స్ బాటిల్స్ గా గుర్తింపు..
సికింద్రాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ టీం సీఐ చంద్రశేఖర్ గౌడ్ ఇతర సిబ్బంది కలిసి తార్నాక ప్రాంతంలో ఒక వ్యక్తి వద్ద పది మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిల్స్ గా గుర్తించి ఆ బాటిల్స్ వివరాలను సేకరించారు.
అక్రమ మద్యం బాటిల్లను అమ్మకాలు జరుపుతున్న మాజీ సైనికుని కొడుకు ఆర్ మాధవన్ హైదరాబాదు లో ఉంటూ వివిధ రాష్ట్రాల నుంచి డిఫెన్స్ మద్యం బాటిల్లను తీసుకొని వచ్చి హైదరాబాదులో అమ్మకాలు జరుపుతున్నట్లు గుర్తించారు.ఈ సందర్భంగా నిందితుడు ఇంట్లో మరో 57 మద్యం బాటిల్లు మొత్తం 67 మద్యం బాటిల్ లను స్వాధీనం చేసుకున్నారు.
వాటి విలువ రూ. 2 లక్షలు గా ఉంటుందని అంచనా వేశారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ 100 పేపర్స్, అమృత్, టీచర్స్ ఇతర మద్యం బాటిల్లు ను పరిశీలించ గా కర్ణాటక, హర్యానా ప్రాంతాలకు చెందిన డిఫెన్స్ బాటిల్స్ గా ఉన్నట్లు విచారణలో వెల్లడిస్తూమద్యం బాటిల్లను అమ్మ కాలు జరుపుతున్న నిందితుడు మాధవన్ సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు సిఐ చంద్రశేఖర్ తెలిపారు.ఈ దాడిలో ట్రైనీ ఏఈ ఎస్ చిరంజీవి,హెడ్ కానిస్టేబుల్ అఫ్జల్,కానిస్టేబుల్ శశిధర్ శేఖర్ జంగయ్య తదితరులు పాల్గొన్నారు.






