27 August, 2026 | 2:27 AM

పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించిన సీపీ

27-08-2026 01:20 AM

హనుమకొండ క్రైమ్, ఆగస్టు 26 (విజయక్రాంతి): హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో క్యాటరింగ్ కాంట్రాక్ట్ పేరు హాస్టల్ యజమానులను మోసం చేస్తూ లక్షల్లో సొమ్మును కాజేసిన నిందితుడుని పట్టు కోవడంలో ప్రతిభ కనబరిచిన హన్మకొండ ఇన్స్ స్పెక్టర్ శివ కుమార్, ఏఏఓ సల్మాన్ పాషాతో పాటు కానిస్టేబుళ్ళు కిరణ్ కుమార్,రమణకుమార్, రవి, మహిళా కానిస్టేబుల్ కారుణ్య, హోం గార్డ్ రవిని  వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత సీపీ కార్యాలయంలో అభినందించారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందికి శాఖపరమైన గుర్తింపు వుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, హన్మకొండ ఏసీపీ నర్సింహారావు పాల్గొన్నారు.