27 August, 2026 | 2:35 AM

మహ్మద్ ప్రవక్త బోధనలు మార్గదర్శకం

27-08-2026 01:18 AM

డాక్టర్ కోట నీలిమ 

సికింద్రాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): పవిత్ర మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని పు రస్కరించుకుని బేగంపేట్ డివిజన్లోని పాటిగడ్డ, విఖార్ నగర్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు నిర్వహించిన మిలాద్-ఉన్-నబీ వేడుకల్లో పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ముస్లిం సోదర, సోదరీమణులతో కలిసి వేడుకల్లో పాల్గొని, మిలా ద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం స్థానికులకు ఖీర్, ఫ్రూట్ జ్యూస్ పం పిణీ చేసి పర్వదిన ఆనందాన్ని వారితో పం చుకున్నారు. ఈ సందర్భంగా నీలిమ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మి లాద్-ఉన్-నబీ సర్వమానవాళికి ఎంతో పవిత్రమైన రోజని పేర్కొన్నారు. ప్రవక్త మహ మ్మద్ బోధనలు కేవలం ఒక మతానికి మా త్రమే పరిమితం కాకుండా ప్రేమ, శాంతి, కరుణ, దయ, సమానత్వం, సోదరభావం వంటి విశ్వమానవ విలువలను చాటిచెప్పే గొప్ప సందేశాలని అన్నారు. ప్రవక్త మహమ్మద్ చూపిన శాంతి, కరుణ, సమభావం, సోదరభావం మార్గం నేటి సమాజానికి ఎంతో అవసరమని డాక్టర్ కోట నీలిమ అన్నారు. మతాలు, కులాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మానవతా విలువలను గౌరవిస్తూ ఐక్యతతో ముందుకు సాగాలని కోట నీలిమ ఆకాంక్షించారు.