02-08-2025 01:21:11 AM
ఆరు కోట్ల నిధులతో ఆకర్షిణీయంగా మారనున్న జలపాతం
పెద్దపల్లి, ఆగస్ట్ 01(విజయ క్రాంతి) పెద్దపల్లి జిల్లాలో సబ్బి తం జలపాతం ఇక పర్యాటక కేంద్రంగా మారనుంది. సబ్బితం జలపాతం అభివృద్ధి పై ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రత్యే క దృష్టి సారించి. జలపాతం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ. 6 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించారు. ఈ నిధులతో జలపాతం చుట్టూ రహదారి, సీటింగ్, వ్యూయింగ్ పాయింట్లు వంటి సౌకర్యాలు కల్పించనున్నారు.
ఎమ్మెల్యే ఈ జలపాతాన్ని అభివృద్ధి చేసి, పర్యాటక రంగానికి ఊతం ఇవ్వాలని భావిస్తున్నారు. జలపాతం అభివృద్ధి కో సం రూ. 6 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ అభివృద్ధి పను ల్లో భాగంగా సబ్బితం గ్రామం నుండి జలపాతం వరకు 3 కి లోమీటర్ల రహదారిని నిర్మించనున్నారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే, సబ్బితం జలపాతం ఒక ముఖ్యమైన ప ర్యాటక కేంద్రంగా మారనుంది, ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా ఎంతో దోహదపడుతుందని స్థానికులు పేర్కొంటున్నారు.
దట్టమైన అడవి, కొండల మధ్యలో ఉన్న ఈ జలపాతం వ ర్షాకాలంలో మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. దీంతో ప ర్యాటక ప్రాంతంగా మారి పర్యటకుల సంఖ్య భారీగా పెరుగుతుంది. జలపాతం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఎమ్మెల్యే విజయరామరావుసబ్బితం జలపాతాన్ని జిల్లాలో పర్యటక ప్రాంతంగా మార్చేందుకు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటీవలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు సహకారాలతో ఆర్ కోట్లు నిధులు ప్రభుత్వ నుండి మంజూరు చేయించి జలపాతాన్ని పర్యటక ప్రాంతంగా మార్చేందుకు కృషి చేస్తున్నారు.