డిగ్రీ కళాశాలల బంద్ విజయవంతం
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి ౨౬ (విజయక్రాంతి): విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో గురువారం డిగ్రీ కళాశాలల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జగజంపుల తిరుపతి మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించిన రూ.10 వేల కోట్లకుపైగా స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌కు సంబంధించిన రూ.218 కోట్ల పెండింగ్ బిల్లులను కూడా చెల్లించాలని కోరారు. విద్యారంగానికి కనీసం 20 శాతం నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో షేక్ సమీర్, జగజంపుల తరుణ్, శివశంకర్ తదితరులు, విద్యార్థులు పాల్గొన్నారు.




