calender_icon.png 20 August, 2025 | 9:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేవలం డిగ్రీలు కార్యాన్ని సాధించలేవు

20-08-2025 12:33:37 AM

పాలకుర్తి రామమూర్తి :

శాస్త్ర విదదృష్ట కర్మాకర్మసు విషాదంగఛ్చేత్

అభిజన ప్రజ్ఞాశౌచ శౌర్యానురాగ 

యుక్తానమాత్యాన్కుర్వీత, 

గుణ ప్రాధాన్యాత్ 

(కౌటిలీయం -1-8)

సంబంధిత రంగంలోని శాస్త్రమెంతగా తెలిసినా అనుభవం లేనివాడు, కార్యక్షేత్రంలో దిగా లు పడతాడు. అందుకే గుణానికే ప్రాధాన్యతనిచ్చి ప్రజ్ఞ, విలువలు, ప్రయత్నశీలత, ఆసక్తికలి గిన వారికి అమాత్య (నిర్వహణ) బాధ్యతలు అప్పగించాలి, అంటాడు చాణక్య.

ఈనాడు పెద్ద పెద్ద విద్యాసంస్థల నుంచి ఉన్న త డిగ్రీలు పొందిన అభ్యర్థుల్లో చాలా మంది కార్పొరేట్ ప్రపంచం పట్ల సరైన అవగాహన లేకుండానే ఉద్యోగార్ధులై వస్తున్నారని సంస్థల ఉద్యోగ నియామక విభాగాధిపతులు వాపోతున్నారు. దానికి కారణం.. అభ్యర్ధులకు సంబంధిత విజ్ఞానంపై అవగాహన ఉన్నప్పటికీ.. ప్రత్యక్ష అనుభవం లేకపోవడం వల్ల సమస్యలు ఎదురవగానే ఒత్తిడికిలోనై తమలోని సమర్ధతను వినియోగించుకోలేకపోతున్నారు.

పరిశ్రమలకు.. విద్యాసంస్థ లకు మధ్య అవగాహనారాహిత్యం వల్ల అనుని త్యం కార్యక్రమాల నిర్వహణా వ్యవహారంలో ఎదురయే సమస్యల నెలా అధిగమించాలో అభ్యర్ధులు తెలుసుకోలేకపోతున్నారు. అందుకే ప్రతి విద్యార్థిలో.. ఎంతటి సమర్ధుడైనా, ఉన్నతస్థాయి శిక్షణను పొందినా, అనుభవ పూర్వకమైన అత్యున్నత చైతన్యం అంతశ్చేతనలో జాగృతం కావడం అవసరం. ఇది విశ్వవిద్యాలయాలో డిగ్రీల కొలమానంతో సాధించలేరు.. బజారులో కొనుగోలు చేయలేరు.. దానిని క్షేత్రస్థాయిలో అనుభవపూర్వకంగా గురువు ద్వారా పొందవలసినదే.

సాధనే అన్నింటా ముఖ్యం..

ఒకప్పుడొక పాలకుడు తన కుమారునిలో ఉన్నతస్థాయి విజ్ఞానం, శక్తిసామర్ధ్యాలు, నైపుణ్యాలు ఉన్నాయని గుర్తించినా.. రాజ్యాన్ని సుస్థిరంగా, ప్రజారంజకంగా పాలించేందుకవి సరిపోవని గ్రహించి.. దానికి అవసరమైన ఉన్నతస్థాయి చైతన్యాన్ని జాగృతం చేసుకునేందుకు ‘తగిన’ గురువు వద్దకు పంపించాడు. క్రొత్త విషయాలను నేర్వడంలో ఆసక్తీ, తపన, జిజ్ఞాస కలిగిన కుమారుడూ వెంటనే గురువు ఆశ్రమాన్ని చేరుకున్నాడు.

కాలుష్యాలకు అతీతంగా నిర్మలమైన ఆశ్రమ వాతావరణం అతనికి ప్రేరణాత్మ కంగా కనిపించింది. గురువును దర్శించి.. నమస్కరించి, తనలోని చైతన్యాన్ని జాగృతం చేసుకు నేందుకు ఎంత సమయం పడుతుందని ప్రశ్నించాడు.. గురువన్నాడు.. అది నీ సాధనపై ఆధారప డి ఉంటుంది..

వివిధ భాషలు, శాస్త్రాలు, ధ్యానంలాంటివి రోజుకు 8 నుంచి 10 గంటల సమ యం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దీనికి అదనంగా.. అంతరాలు లేకుండా, చిన్నాపెద్ద పనులన్నింటినీ చేస్తూ అవసరమైన డబ్బు సంపాదించి ఆశ్రమ నిర్వహణ చేయాలి. ఇక్కడ సమయపాలన, ప్రేమతత్త్వం, బాధ్యతా నిర్వహణలు ముఖ్యమైనవి. 

క్రియాశీలతే లక్ష్యంగా..

గురువు మరొకమాటా చెపుతాడు.. నీవు పనులు చేస్తున్న సమయంలో.. నేను అకస్మాత్తుగా వచ్చి కర్రకత్తితో దాడి చేస్తాను.. నీవా దాడి నుంచి కాపాడుకోవాలి.. రాకుమారునిగా యదేఛ్చగా జీవించిన విద్యార్థికది నచ్చకపోయినా.. లక్ష్యాన్ని సాధించాలనే; సంకల్పంతో ఒప్పుకున్నాడు. ఒకటి రెండు రోజులు సాధారణంగానే గడచినా మరునాడు గురువు కత్తితో దాడిచేసి విద్యార్థిని దెబ్బతీసాడు. దెబ్బతిన్న విద్యార్థిలో ‘క్రియాశీలత’ పెరిగింది.

కొద్దికాలంలోనే తనచుట్టూ నీడలు కనిపించినా, వెలుగులో మార్పులు కనిపించినా జాగ్రత్తగా ఉండడంలో ‘అవగాహన’ను పెంచుకున్నాడు.; తదుపరి ఒకనాడు గురువుగా రు.. నిజమైన కత్తితో వస్తానని చెప్పాడు.. పలుమార్లు అతనికి గాయాలైనా విద్యార్థి ‘అప్రమ త్తత’ను పెంచుకున్నాడు. కొద్దికాలంలోనే ఎలాం టి వాతావరణంలోనైనా, ఎలాంటి కదలికలనైనా, మార్పులనైనా, ప్రవర్తనలనైనా,; త్వరగా గ్రహించడం, వేగంగా స్పందించడం అలవరుచుకు న్నాడు. జాగృతిని పొందడం, అప్రమత్తంగా ఉండడం అభ్యసించాడు.

అత్యున్నత స్థాయికి చైతన్యం..

మరొకనాడు గురువన్నాడు.. నేను రాత్రి పగలనే భేదం లేకుండా.. నీవు నిద్రలో ఉన్నా మెలు కువతో ఉన్నా కర్రకత్తితో దాడిచేస్తాను. అప్రమత్తంగా ఉండే బాధ్యత నీది.. అవగాహన కలిగిన విద్యార్థి గురువు మాటల అంతర్యాన్ని గ్రహించి పరిసరాలను జాగ్రత్తగా; పరిశీలించాడు. కుటీరంలోని తలుపుల బంధాలు తొలగించబడడం చూ చి అప్రమత్తమయ్యాడు. కొన్నిమార్లు ప్రమత్తతతో దెబ్బతిన్నా.. అతనిలో చైతన్యం అత్యున్నత స్థాయికి పెరిగింది.

నిద్ర యోగనిద్రగా మారింది. అంతరంగం.. తానే స్థితిలో ఉన్నా తన చుట్టూ జరుగుతున్న చిన్నాపెద్ద మార్పులను గ్రహించడం, సన్నివేశాల మధ్య సంబంధాలను అవగా హన చేసుకోవడం, వేగంగా ఆలోచించడం, తగిన విధంగా స్పందించడం, రక్షణను పొందడం నేర్చుకున్నది. అక్షరాలను చదవడం కాక అక్షరాల ఆంతర్యాలను అవగాహన చేసుకోవడం అలవడింది. జరిగిన, జరుగుతున్న, జరగబోయే సంఘ టనలను దర్శించగల సామర్ధ్యాన్ని సాధించాడు.

అతని అవగాహనాస్థాయి సహజ ప్రవృత్తి నుంచి అంతర్దృష్టికి, అటనుండి ఉన్నతస్థాయి ‘స్పృహ’ను చేరి దార్శనికతను ప్రసాదించింది. ప్రతి సన్నివేశాన్ని ముందే ‘తెలుసు’కోగలగిన స్పురణ జాగృతమయింది. భావవ్యక్తీకరణలు, అవగాహనలు పరిణతి చెందాయి. ఎదుటివారు మాట్లాడ క ముందే.. వారి భావనలను, ఉద్దేశ్యాలను, అంచనాలను, ఆకాంక్షలను, ఆంతర్యాన్ని గ్రహించగ లిగిన చైతన్యస్థాయి మేల్కొన్నది. బుద్ధి ‘ఎఱుక’గా పరివర్తన చెందింది.

‘అనుభవం’ విజ్ఞాన ప్రకాశమై..

ఓడకుండా ఉండడానికి కాదు గెలవడానికి ప్రయత్నించాలనే స్పృహ వెలుగుచూచింది. చేసే పనిలోని ప్రయోజనాన్ని గ్రహించడం నేర్చుకున్నాడు. ‘అనుభవం’ విజ్ఞాన ప్రకాశాన్ని అనంతం గా పెంచింది. ‘అత్యున్నత స్పృహ’ వ్యక్తుల మధ్య బంధాలనే కాక హృదయాలను, మేధను, ఆలోచనలను ఎలా ప్రభావితం చేస్తుందో అవగాహన చేసుకున్నాడు. వాటి మధ్య సంబంధాలను కలపగల సామర్ధ్యమూ వెలుగు చూచింది. వికసన విస్తరణగా మారి వ్యాప్తమయింది.

అక్షరజ్ఞానం అనుభవజ్ఞానంగా పరివర్తన చెంది పరస్పరాధారిత భావనలకు దారిచూపింది. ప్రజల ప్రగతియే తనకు సుగతిగా భావించే చైతన్యం అనుభవ పూ ర్వకంగా తెలుసుకోగలిగాడు. తనలోని విషయ సంబంధిత విజ్ఞానానికి సమగ్రతను సంతరించిన అనుభవ జ్ఞానం తోడై అనూహ్యమైన అత్యున్నత లక్ష్యాలను నిర్దేశించుకునే భావనా పటిమ ఆవిష్కృతమయింది. పెంచుకోవడం, పంచుకోవడం లోని ఆనందాన్ని అవగతం చేసుకొని అత్యద్భుత ఫలితాలను సాధించగలిగాడు.