20-08-2025 12:25:49 AM
సంపతి రమేష్ :
డాక్టర్ నరేంద్ర దబోల్కర్ వర్ధంతి సందర్భంగా :
భారతదేశం అభివృద్ధిలో దూసుకెళ్తున్నప్పటికీ సమాజంలో నెలకొన్న మూఢ నమ్మకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవి ఆచరణలో నిరూపితం కాని అశాస్త్రీయమైన విశ్వాసాలు. సైన్స్ కు సమాంతరంగా పురోగమించిన సూడో సైన్స్ మానవ ప్రగతికి అవరోధంగా మారుతున్నాయి. మాన వాతీత శక్తుల ను నమ్మి క్షుద్ర పూజలకు పూనుకోనే సంస్కృతి విజృంభిస్తుంది. చేతబడి, దయ్యాలు, భూతాలు, మంత్రా లు ఇలా రకరకాల అందవిశ్వాసా లు చాప కింద నీరులా ప్రవహిస్తున్నాయి.
ఇలాంటి వాటికి విరుగుడు చర్యలుగా నర బలులు, జంతు బలులు చేయడం సాధారణమైపోయింది. రోజు రోజుకు ఇది ఒక తంతులా మారి ప్రజల మానసిక రుగ్మతలకు దారితీస్తున్నా యి. ఈ క్రమంలో అంధ విశ్వాసాలపై అవిశ్రాంతంగా పోరాడిన గొప్ప వ్యక్తి నరేంద్ర అచ్యుత్ దబోల్కర్. నరేంద్ర దబోల్కర్.. నవంబరు 1, 1945న మహారాష్ట్రలో జన్మించారు.
అ ంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా గళం విప్పి వాటి నిర్మూల నకు ‘మహారాష్ర్ట అంధశ్రద్ధ నిర్మూలన సమితి’ స్థాపించారు. సమాజంలోని సామాజిక రుగ్మతల ను తొలగించడానికి చేస్తు న్న కృషిని ఓర్వలేక 2013 ఆగస్టు 20న చాందసవాదుల వాదుల చేతిలో బలైపోయారు. ఆయన మరణించిన రోజును దేశవ్యాప్తంగా సైన్స్ సంఘాలు ‘జాతీయ శాస్త్రీయ దృక్పథ దినోత్సవం’గా జరుపుకుంటున్నారు.
మంత్రాల నెపంతో దాడులు..
నేటి వైజ్ఞానిక సమాజంలో సైతం అందవిశ్వాసాల తీవ్రత తగ్గలేదు. ప్రస్తుత సమాజం సైన్స్ ఫలాలను అనుభవిస్తూనే మూఢ నమ్మకాలను విశ్వసించే వారి సంఖ్య పెరుగుతోంది. విద్యావంతుల్లో శాస్త్రీయ వైఖరి లోపించడం, మితిమీరిన మత విశ్వాసాలు, అశాస్త్రీయ బోధనలు కారణాలుగా ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వాల పరిపా లన విధానాలు, మీడియా ప్రకటనలు.. ప్రజల్ని మూఢత్వం దిశగా ప్రేరేపిస్తున్నాయి.
దీంతో రంగురాళ్లు ధరించడం, సంఖ్యా శాస్త్రం ఆధారంగా పేర్లు మార్చుకోనే వారి సంఖ్య పెరిగింది. తాయత్తు మెడకు చుట్టుకుంటే అన్నీ శుభాలే జరుగుతాయని, మంత్రించిన అష్టలక్ష్మి యంత్రాలతో అష్టుశ్వైర్యాలు చేకూరుతాయని నమ్మేవారి సంఖ్య పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో వీటిని ప్రసారం చేసే టీవీలు, సెలబ్రిటీల పైన, వ స్తువులను అమ్మేవారి పైన మూఢనమ్మకాల నిర్మూలన చట్టం కింద కేసు నమోదు చేయాలని మహారాష్ర్ట హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం గొప్ప ముందడుగు.
చేతబడి చేశారన్న నెపంతో ఆదివాసీ, దళిత, వెనకబడిన వర్గాల కు చెందినవారిని.. ముఖ్యంగా మహిళలను హత మార్చడం పరిపాటిగా మారిం ది. జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) లెక్కల ప్రకారం ఒక్క 2022లో నే దేశవ్యాప్తంగా 85 చేతబడి హత్యలు జరిగాయి. గడిచిన దశాబ్ద కాలంలో 1,184 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవి శాంతి భద్రతలు, ప్రజారోగ్యానికి పెను సవాలుగా నిలుస్తున్నాయి.
చట్టమే మార్గం
శాస్త్రీయ దృక్పథం అన్నది జీవితంలో ఒక భాగం కావాలి. తోటి వారితో మన ప్రవర్తన, ఆలోచన, చేరిక శాస్త్రీయంగా ఉండాలి. సైంటి ఫిక్ టెంపర్ మనిషి తప్ప క ప్రయాణం చేయవలసిన మార్గం. 79 ఏళ్ల స్వాతం త్య్రం పూర్తి చేసుకున్న మనం ఇవాళ కూడా అశాస్త్రీయత, మూఢనమ్మకాల గురించి మాట్లాడుకోవడం శోచనీయం. దేశవ్యాప్తంగా సైన్స్ ఆవిష్కరణలను వాడుకుం టూ అశాస్త్రీయ భావాలను ప్రచారం చేస్తున్నారు. సూడో సైన్స్ భావాలు పెరుగుతున్నాయి. ఈ ప్రచారాలు ఆపాలన్నా.. నిజమైన సైన్స్ బోధన జరగాలన్నా.. ‘మూఢనమ్మకాల వ్యతిరేక చట్టం’ తీసుకు రావాలి.
మూఢనమ్మకాలను కట్టడి చేసేందుకు నిరంతరం శ్రమించిన నరేంద్ర దబోల్కర్ హత్యానంతరం మహారాష్ర్టలో మూఢనమ్మకాల చట్టం వచ్చింది. ఇదే సమయంలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చట్టం తీసుకురావాలని అనేక సైన్స్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పాఠశాల దశలోని విద్యార్థులకు శాస్త్రీయ దృక్పథంపై అవగాహన పెంచాలి. ఇదే నరేంద్ర దబోల్కర్‌కు మనమిచ్చే ఘనమైన నివాళి.
వ్యాసకర్త సెల్: 7989579428.