15-12-2025 12:55:05 PM
హైదరాబాద్: బంగారం ధరలు(Gold Prices) రోజురోజుకు పెరుగుతున్నాయి. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,31,270కి చేరగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం(Todays Gold Rate) రూ. 1,25,850కి చేరింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 1,96,265కి పెరిగింది. నిఫుణులు అంచనా వేసినట్లే బంగారం భవిష్యత్తులో సామాన్యులకు అందని బంగారు కొండగా మారనుంది. 2025 సంవత్సరం బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేసే పరిస్థితి వచ్చింది. ఈ ఏడాది మొత్తం పసిడి ధరలు పెరుగుతూ వచ్చాయి.
సోమవారం నాడు దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే 24 క్యారెట్ల గ్రాము Gold ధర రూ. 82 పెరిగి రూ.13,473 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 75 పెరిగి రూ. 12,350 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 62 పెరిగి రూ.10,105 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 8,200 పెరిగి రూ.13,47,300 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 100 గ్రాములు రూ. 7500 పెరిగి రూ. 12,35,000 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారెట్ల బంగారం ధర 100 గ్రాములు ధర రూ.6200 పెరిగి రూ.10,10,500 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం ధరలు పెరిగిపోవడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.