26-07-2024 03:45:42 PM
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను వర్చువల్ గా ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. సీబీఐ కోర్టుల జడ్జి సెలువులో ఉండడం వల్ల కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఢిల్లీ మద్యం కేసు విచారణను జడ్జి ఈనెల 31కి వాయిదా వేశారు. మరోవైపు సీబీఐ దాఖలు చేసిన కేసులో వాదనలు విన్న న్యాయమూర్తి కావేరీ బవేజా గురువారం రాత్రి రిమాండ్ ను ఆగస్టు 8వ తేదీ వరకు పోడిగించింది. నిందితులను తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. ప్రస్తుతం కవిత తిహాడ్ జైలులో ఉన్నారు.