26-07-2024 04:06:26 PM
హైదరాబాద్: దివ్యాంగులపై స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై ప్రొఫెసర్ కోదండరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దివ్యాంగులపై స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను కోదండరామ్ ఖండించారు. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. వైకల్యం పేరుతో దివ్యాంగుల హక్కులను హరించడం తగదని పేర్కొన్నారు. దివ్యాంగులు ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించారని కోదండరామ్ వెల్లడించారు. చట్టాలను అమలు చేయాల్సిన వ్యక్తే వైకల్యాన్ని కించపరచడం తగదని హెచ్చరించారు. స్మితా సబర్వాల్ తన వ్యాఖ్యలను సమర్థించుకోవడం శోచనీయం అన్నారు.