calender_icon.png 22 November, 2025 | 12:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెడ్‌బుక్ తెరవకముందే జగన్ ఢిల్లీ వెళ్లి గగ్గోలు పెడుతున్నారు

26-07-2024 03:23:58 PM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన సభ చివరిరోజున నారా లోకేష్ కు భారీ ఎత్తున వినతులు అందుతున్నాయి. పలువురు నామినేటెడ్ పదవుల ఆశావహులు లోకేష్ ను కలిసి తమ బయోడేటా వివరాలను అందించారు. తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన వారికి న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. రెడ్‌బుక్ లో పేర్లు నమోదు చేస్తున్నానని అనేక సభల్లో చెప్పానని లోకేష్ అన్నారు. తప్పు చేసిన వారిని చట్టప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. రెడ్‌బుక్ తెరవకముందే జగన్ ఢిల్లీ వెళ్లి గగ్గోలు పెడుతున్నారని ఆరోపించారు. ఐదేళ్ల పాలనలో జగన్ రెండుసార్లే ప్రెస్ మీట్ పెట్టారు.. కానీ ఈ నెలరోజుల వ్యవధిలో జగన్ ఐదుసార్లు ప్రెస్ మీట్ పెట్టారని నారా లోకేష్ తెలిపారు.