calender_icon.png 25 January, 2026 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీధి రౌడీల్లా కాంగ్రెస్ శ్రేణులు

25-01-2026 01:04:58 AM

  1. మద్యం మత్తులో కాంగ్రెస్ గూండాల విధ్వంసం 
  2. ఎమ్మెల్యే పల్లాపై దాడి యత్నాన్ని ఖండించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి): సాక్షాత్తు రాష్ట్ర మంత్రి సీతక్క సమక్షంలోనే పట్టపగలు కొందరు కాంగ్రె స్ శ్రేణులు తాగొచ్చి వీధిరౌడీల్లా వ్యవహరించడం తెలంగాణలో క్షీణించిన శాంతిభద్రతలకు అద్దంపడుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. జనగామ పట్టణంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ గూండాలు దాడికి యత్నించిన సంఘటనను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు.

ఓవైపు ము ఖ్యమంత్రి అధికార మత్తులో విదేశాల్లో జల్సాలు చేస్తుంటే, కాంగ్రెస్ గుండాలు మ ద్యం మత్తులో వీర్రవీగుతూ విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అధికారికంగా జరిగే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల వద్ద కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టాల్సిన దుస్థితి తెలంగాణలో నెలకొని ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రే స్వయంగా నేరాలను పెంచి పోషించేలా ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలో లా అండ్ ఆర్డర్‌ను తీవ్రంగా దెబ్బతీసే ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు.

బీఆర్‌ఎస్ పార్టీతోపాటు తెలంగాణ సమా జం కూడా ఈ గడ్డపై ఇలాంటి ఫ్యాక్షన్ సం స్కృతిని ఎట్టిపరిస్థితుల్లో సహించబోదని స్ప ష్టం చేశారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు కర్రుగాల్చి వాతపెట్టారని, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రికి, అధికార పార్టీ అరాచక పర్వానికి తెలంగాణ ప్రజలు తప్పకుండా సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.