07-02-2026 12:00:00 AM
కామారెడ్డి, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): పదవ తరగతి మూల్యాంకన కేంద్రం కామారెడ్డికి కేటాయించినందుకు పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీ హరి కి పి ఆర్ టి యు తెలంగాణ కామారెడ్డి జిల్లా పక్షాన అభినంద లు తెలిపినట్లు కామారెడ్డి జిల్లా పిఆర్టియు తెలంగాణ అధ్యక్షులు అంబిర్ మనోహర్ రావు ప్రధాన కార్యదర్శి జనపాల లక్ష్మీరాజం లు శుక్రవారం ధన్యవాదాలు తెలిపారు. కామారెడ్డి జిల్లా ఏర్పడి దాదాపు పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ కామారెడ్డి జిల్లా కేంద్రంలో పదో తరగతి కేంద్రం ఏర్పాటు చేయకపోవడం వల్ల జిల్లాలోని ఉపాధ్యాయులు నిజాంబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లి మూల్యాంకరింగ్ చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
పిఆర్టియు తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డిలో గత నెల ఐదున విజ్ఞాపన పత్రం అందించడం జరిగింది అన్నారు. వారు సానుకూలంగా స్పందించి కామారెడ్డి జిల్లాకు పదవ తరగతి మూల్యాంకల కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కామారెడ్డి జిల్లా ఉపాధ్యాయులకు ఎంతో సౌకర్యవంతంగా అందుబాటులో మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు వారు తెలిపారు.