భారత్ స్లోవేకియా మైత్రి బలోపేతం
ఇరుదేశాల మధ్య 11 రంగాల్లో ఒప్పందం
స్వేచ్ఛా వాణిజ్యం, రక్షణ, డిజిటల్ తదితర రంగాల్లో అంగీకారం
ఒపందంపై సంతకాలు చేసిన ప్రధానులు మోదీ, రాబర్ట్ ఫికో
స్లోవేకియాలో మోదీకి వందేమాతరం, రొట్టే, సాల్ట్‌తో స్వాగతం
బ్రాటిస్లావా, జూన్ 15: భారత్, స్లోవేకియా మధ్య స్వేచ్ఛా వాణిజ్యం, రక్షణ, తది తర రంగాల్లో సహకారానికి ఒప్పందం కుదిరిందని, ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారత్- యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా అమలుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
కార్మిక వలస లు, రక్షణ, డిజిటల్ టెక్నాలజీలు, ఉన్నత విద్య, క్వాంటం కమ్యూనికేషన్, ప్రాంతీయ అనుసంధానం, స్వేచ్ఛాయుత అంతర్జాతీయ వాణిజ్యం, నౌకాయాన స్వేచ్ఛ, వివాదాల శాంతియు త పరిష్కారం వంటి రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించేందుకు మొ త్తం 11 ఒప్పందాలు కుదిరాయని తెలిపారు.
ఆటోమొ బైల్ తయారీ, రైల్వే అభివృద్ధి, పెట్టుబడులు, ఆవిష్కరణల రంగాల్లో కీలక అడుగులు పడ్డాయని మోదీ స్పష్టం చేశారు. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన స్వాగతం లభించింది. ప్రధానమంత్రి మోదీ నైస్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపిన అనంతరం, రెండు రోజుల పర్యటనలో(జూన్ 14- భాగంగా ఆదివారం రాత్రి స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాకు వెళ్లారు. రాజధానిలో అడుగుపెట్టిన మోదీకి వందేమాతరంతో ఘన స్వాగతం పలికారు.
అదేవిధంగా ప్రత్యేకంగా బ్రెడ్ అండ్ సాల్ట్‌తో ఆహ్వానం అందిం చారు. ప్రధాని మోదీని ప్రవాస భారతీయు లు కూడా కలిశారు. ఇరుదేశాల మధ్య జరిగిన చర్చల అనంతరం స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోతో కలిసి భారత ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. స్లోవేకియా, భా రత్ మధ్య సమగ్ర భాగస్వామ్యం ద్వైపాక్షిక సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్లడం, ఇప్పటికే ఉన్న సహకార యంత్రాంగాలను మరింత బలోపేతం చేయడం, ద్వైపాక్షికంగా, బహుపాక్షికంగా సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషించడం లక్ష్యంగా ఒప్పందాలు జరిగాయని మోదీ తెలిపారు.
ఈ సంబంధాలకు ‘కొత్త దిశానిర్దేశం’ చేసే మార్గాలపై తాను, ఫికో చర్చించినట్లు తెలిపారు. అణుశక్తి, భూఉష్ణ విద్యుత్‌తో సహా ఇంధన వనరుల వైవిధ్యీకరణ ద్వారా ఇంధన భద్రత, సుస్థిరత, స్థితిస్థా పకతను ప్రోత్సహించడమే లక్ష్యమన్నారు. ఆటోమొబైల్, రైల్వేలు, అధునాతన తయా రీ, హరిత సాంకేతికతలు మాకు ప్రత్యేక ఆస క్తి ఉన్న మొత్తం 11 రంగాల్లో ఇరుదేశాల మధ్య అంగీకారం కుదిరిందన్నారు.
‘21వ శతాబ్దపు వాస్తవాలు, సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రపంచ సంస్థలు తమను తాము పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారత్- స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడంలో స్లోవేకియా సహకారానికి ప్రధాని ఫికోకు మోదీ అభినందనలు తెలిపారు. ప్రధాని ఫికో మా ట్లాడుతూ, భారత్- స్వేచ్ఛా వాణి జ్య ఒప్పందాన్ని ప్రశంసిస్తూ, ఇప్పటివరకు కుదిరిన వాణిజ్య ఒప్పందాలలో ఇది ‘అత్యంత ప్రతిష్టాత్మకమైనది’ అని అభివర్ణించారు.
మోదీ, -ఫికో చర్చల అనంతరం కుదిరిన ఒప్పందాలు.. కార్మిక వలసలు, రక్షణ, డిజిటల్ టెక్నాలజీలు, ఉన్నత విద్య, క్వాం టం కమ్యూనికేషన్ తదితర రంగాలు ఉన్నా యి. 1993లో స్లోవేకియా స్వతంత్ర దేశంగా ఏర్పడిన తర్వాత ఆ దేశాన్ని సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీనే కావడం విశేషం. జూన్ 16- తేదీలలో ఎవియాన్‌లో జరిగే జీ7 సదస్సులో పాల్గొనేందుకు మోదీ ఫ్రాన్స్‌కు తిరిగి వెళ్లనున్నారు.
మోదీకి వందేమాతరంతో ఘనస్వాగతం
హోటల్‌కు చేరుకున్న వెంటనే, స్లో వాక్ రిపబ్లిక్ విదేశీ, యూరోపియన్ వ్యవహారాల మంత్రి శ్రీ జురాజ్ బ్లనార్ ప్రధానమంత్రికి స్వాగతం పలికారు. ఆతిథ్యం, గౌరవం, సద్భావనకు చిహ్నం గా రొట్టె, ఉప్పుతో ప్రధాని మోదీకి స్లో వాక్ సంప్రదాయం ప్రకారం ఘనస్వాగతం లభించించింది. అలాగే బ్రాటి స్లావాలో అడుగుపెట్టిన మోదీకి వందేమాతరంతో ప్రత్యేక స్వాగతం పలికారు. ప్ర వాస భారతీయులు కూడా హాజరై మన దేశ ప్రధానికి ఘన స్వాగతం తెలిపారు. అక్కడి ప్రసిద్ధ కళాబృందం లు చ్నికా ఎన్సెంబుల్ వందేమాతరం ఆలపించి ప్రత్యేక స్వాగతం పలికింది.






